అదుపుతప్పి లారీ చెట్టును ఢీకొట్టడంతో ఒకరు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన కరీంనగర్-హుజురాబాద్ మండలం మాందాడి పల్లిలో వరంగల్-కరీంనగర్ జాతీయ రహదారిపై బుధవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్‌లో ఇరుక్కుని క్లీనర్ మృతి చెందినట్లు తెలుస్తోంది.
యాక్సిడెంట్ జరిగిన సమయంలో స్థానికులు, ఫైర్ సిబ్బంది శ్రమించి డ్రైవర్‌ను బయటకు తీసుకొచ్చారు.డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కావడంతో హుజరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి అతివేగమే కారణమని తెలుస్తుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.