డంపింగ్ యార్డు తొలగించాలి.. చెత్తలో కూర్చుని ఎమ్మెల్యే నిరసన

-

డంపింగ్ యార్డ్ తొలగించాలని చెత్త కుప్పలో కూర్చుని బీఆర్ఎస్ మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ధర్నా నిర్వహించారు. మేడ్చల్‌ – మల్కాజిగిరి జిల్లా అల్వాల్ మచ్చ బొల్లారంలో శ్మశాన వాటికలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడంపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

చెత్త వాసన భరించలేకపోతున్నామని.. ఫలితంగా దోమల బెడద అధికం అయ్యిందని, ఇక్కడి నుంచి డంపింగ్ యార్డును మరో చోటుకు తరలించాలని స్థానికులు ప్రభుత్వాన్ని గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి స్థానికులకు మద్దతుగా చెత్తకుప్పలో కూర్చుని నిరసన తెలుపుతూ డంపింగ్ యార్డును వేరే చోటుకు తరలించాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version