కేసీఆర్ తాగుబోతోడు అని సీఎం రేవంత్ అనడం సరికాదు : టీడీపీ మహిళా నేత ప్రసూన

-

మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ జాతిపిత ఎలా అవుతాడని.. తాగుబోతోడిని జాతిపిత ఎలా అంటారని స్టేషన్ ఘనపూర్ సభలో సీఎం రేవంత్ రెడ్డి తీవ్రమైన పదజాలంతో దూషించిన విషయం తెలిసిందే. ఆ వాఖ్యలను టీడీపీ మహిళా నేత, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన ఖండించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ..

‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కేసీఆర్ పాత్ర మరువలేనిది.తెలంగాణ రాష్ట్రం సాధించడంలో అన్ని పార్టీలను కలుపుకుని ముందుకు పోయి తెలంగాణ రాష్ట్రంను సాధించిన వ్యక్తి కేసీఆర్. నేను 18 సంవత్సరాలు కేసీఆర్‌తో కలిసి పని చేశాను. నిన్న సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్‌ను తాగుబోతు అన్న పదం నన్ను చాలా బాధించింది..వ్యక్తిగత విషయాలను రాజకీయాలకు ముడిపెట్టడం సరైంది కాదు.

నా పార్టీ ఏదైనా కానీ, పార్టీలతో పని లేకుండా నేను కేసీఆర్‌పై ముఖ్యమంత్రి వాడిన పదజాలంని సిగ్గుతో తలవంచుకుంటున్నాను.రాజకీయాలు అంటే ఇంత హీనంగా ఉండాలా?..ఇంత దిగజారి మాట్లాడటం దేనికి సంకేతం.పథకాలతో అభివృద్ధిలో పోటీపడాలి.. కొత్త పథకాలు ఇచ్చి రాజకీయాలు చేయాలి. కానీ, ఇలాంటి సిగ్గుమాలిన మాటలతో రాజకీయాలు చేయొద్దు’ అని కాట్రగడ్డ ప్రసూన అభ్యంతరం వ్యక్తం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version