కరోనా సమయంలో రియల్ హీరో సోను సూద్… చేసిన సేవలను ఎవరూ మర్చిపోలేరు. వలస కార్మికులకు, కరోనా బాధితులకు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మరియు ఎంతో మందికి సహాయం చేశారు సోనూసూద్. అయితే తాజాగా సోనూసూద్ పౌండేషన్ పేరుతో ఘరానా మోసానికి దిగారు. శ్రీకాకుళం జిల్లాలో సోను సూద్ పేరు చెప్పి ఓ నిరుపేద విద్యార్ధి దగ్గర ఏకంగా రెండు వేల రూపాయలు కాజేశారు.
ఈ ఘటన వివరాల్లోకి వెళితే… సంతబొమ్మాలి గ్రామానికి చెందిన కొయ్యలి రాంబాబు… అనే వ్యక్తి త్రిపుల్ ఐటీ లో చదువుతున్నాడు. ఇటీవల రాంబాబు తండ్రి కరోనా చనిపోగా… తల్లి పక్షవాతంతో మంచం పట్టింది. దీంతో రాంబాబు కుటుంబం గడవడం చాలా కష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనే సోమవారం ఉదయం పూట… రాంబాబు ఫోన్ కు గుర్తు తెలియని వ్యక్తి… కాల్ చేశాడు. తాను సోనూసూద్ పౌండేషన్ కు సంబంధించిన వ్యక్తి అని రాంబాబు పరిచయం చేసుకున్నాడు. సాయంత్రం వరకు నీ అకౌంట్ లో మూడు లక్షల రూపాయలు పడతాయని… రాంబాబు ను నమ్మబలికాడు. ఈ మూడు లక్షల రూపాయలు జమ కావాలంటే…. జిఎస్టి ఫీజు 12000 అలాగే ప్రాసెసింగ్ ఫీజు 2000 కట్టాలని రాంబాబుకు ఆ వ్యక్తి వివరించాడు. దీంతో ఆ మాటలు నమ్మిన రాంబాబు… తన స్నేహితుని వద్ద రెండు వేల రూపాయలు అడిగి… ఆ వ్యక్తి అకౌంట్లో జమ చేశాడు. సాయంత్రం కాగానే ఆ వ్యక్తికి ఫోన్ చేయడంతో… మొబైల్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దీంతో… రాంబాబు కంగుతిన్నాడు. సోనూ సూద్ పేరు చెప్పి తనను మోసం చేశాడని గ్రహించుకున్నాడు.