మష్రూమ్ బ్రౌన్ రైస్ రెసిపీ| Mushroom Brown Rice Recipe: బ్రౌన్ రైస్ (దంపుడు బియ్యం) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దంపుడు బియ్యం తో వివిధ రకాల రెసిపీస్ ని మనం తయారు చేసుకోవచ్చు. అయితే ఈ రోజు మనం మష్రూమ్ మరియు బ్రౌన్ రైస్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.
మష్రూమ్ బ్రౌన్ రైస్ తయారీకి కావలసిన పదార్థాలు
- ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు
- ఒక వెల్లుల్లిపాయ
- రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్
- నీళ్లు
- ఒక కప్పు ఉడికించుకున్న బ్రౌన్ రైస్
- రెండు కప్పుల మష్రూమ్స్
- ఉప్పు రుచికి సరిపడా
- అర టీ స్పూన్స్ చిల్లీ ఫ్లేక్స్
- అర టీ స్పూన్ మిరియాల పొడి
మష్రూమ్ బ్రౌన్ రైస్ తయారు చేసుకునే పద్ధతి:
ముందుగా ఒక పాన్ తీసుకుని ఆలివ్ నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత తరిగిన ఉల్లిపాయలు, వెల్లుల్లి వేసి వేయించాలి. ఆ తర్వాత అందులోనే మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్, మష్రూమ్ ముక్కలు వేసుకోవాలి. దానిలో నీళ్ళు పోసి నీళ్లు మరిగే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉంచాలి.
మష్రూమ్స్ బాగా కుక్ అయ్యే వరకూ ఉంచాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మష్రూమ్స్ బాగా ఉడికిన తర్వాత దానిలో ఉడికించిన బ్రౌన్ రైస్ వేసేయాలి. ఇప్పుడు ఎనిమిది నుండి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉంచి నీళ్లు ఆవిరై పోయాక సర్వ్ చేసుకోవాలి. ఇలా ఈజీగా మనం ఇంట్లో ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చు. డయాబెటిస్ ఉన్నవారు బ్రౌన్ రైస్ ను తినవచ్చా ? అనే సందేహాలు అవసరం లేదు. ఎంచక్కా రోజూ తింటే ఆరోగ్యమే ఆరోగ్యం.. బ్రౌన్ రైస్, వైట్ రైస్ ఈ రెండింటిలో ఏది మంచిది అనే విషయంలో బ్రౌన్ రైస్ మంచిదని తెలుస్తుంది. బ్రౌన్ రైస్ తో కేవలం అన్నం మాత్రమే కాదు ఎంతో రుచికరమైన క్రిస్పీ బ్రౌన్ రైస్ దోస రెసిపీ మీకోసం ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. అలాగే తక్కువ సమయంలోనే బ్రౌన్ రైస్ తో పెరుగన్నం ఇలా తయారు చేసుకోండి..!