అనురాగ్ బాయ్స్ హాస్టల్లో వ్యక్తి దారుణ హత్య.. వివాహేతర సంబంధమే?

-

మేడ్చల్‌లోని మేడిపల్లి మండలం పీర్జాదిగూడ పరిధిలోని అనురాగ్ బాయ్స్ హాస్టల్‌లో దారుణ హత్య చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..మల్లికార్జున నగర్ లోని అనురాగ్ రెడ్డి బాయ్స్ హాస్టల్‌లో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ హత్యకు దారి తీసినట్లు తెలుస్తోంది. జనగాంకు చెందిన మహేందర్ రెడ్డి (38) నగరంలో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తూ హాస్టల్‌లో నివాసం ఉండేవాడు.

హాస్టల్ ఓనర్ పద్మ (40)కు మహేందర్ రెడ్డికి మధ్య గతంలో గొడవ జరిగినట్లు సమాచారం. దీంతో మహేందర్ రెడ్డి ఈ మధ్యనే హాస్టల్ ఖాళీ చేసి వెళ్ళిపోయాడు.ఈ క్రమంలోనే శుక్రవారం మహేందర్‌ని పద్మ హాస్టల్‌కి పిలవగా.. శనివారం ఉదయం 3.30 గంటలకు అతను వచ్చాడు. అదే హాస్టల్‌లో ఉండే కిరణ్ రెడ్డి(35) వంటలు చేసే పెద్ద గంటెలతో దాడి చేసి కత్తితో పొడిచి మహేందర్ రెడ్డిని హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం పద్మ, కిరణ్ రెడ్డి పోలీసులు అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని సీఐ గోవింద రెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news