తెలంగాణలో పెను విషాదం చోటు చేసుకుంది. యాదాద్రి జిల్లా పెద్దకందుకూరులో భారీ పేలుడు సంభవించింది. యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరు లో ఉన్న ప్రీమియర్ ఎక్సప్లొజివ్ లో రియాక్టర్ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. అలాగే… ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అంటున్నారు.
పెద్దకందుకూరులో భారీ పేలుడు లో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఇక పేలుడు సంభవించడంతో… అందరూ షాక్ అయ్యారు. భయంతో పరుగులు తీశారు కార్మికులు. ఇక యాదాద్రి జిల్లా పెద్దకందుకూరులో భారీ పేలుడు పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు… దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.
Breaking News
యాదాద్రి జిల్లా పెద్దకందుకూరులో భారీ పేలుడు
ప్రీమియర్ ఎక్సప్లొజివ్ కంపెనీలో పేలుడు
8 మంది కార్మికులకు తీవ్ర గాయాలు
ఇద్దరి పరిస్థితి విషమం, ఆసుపత్రికి తరలింపు
భయంతో పరుగులు తీసిన కార్మికులు
File Pic – pic.twitter.com/OmUGZ81Jq5
— Telugu Scribe (@TeluguScribe) January 4, 2025