ఏపీలోని తిరుపతి జిల్లాలో గల స్టీల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం అర్ధరాత్రి పెళ్లకూరు మండల పరిధిలోని పెన్నేపల్లిలో గల స్టీల్ తయారీ ఫ్యాక్టరీలో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 10 మంది కార్మికులకు గాయాలయ్యాయి. మంటల ధాటికి ఫర్నిచర్ యూనిట్ మొత్తం కాలి బూడిదైనట్లు సమాచారం.
ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సమయంలో కార్మికులంతా అలర్ట్‌గా ఉండటంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కాగా, ఈ అగ్ని ప్రమాదం వలన భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు యాజమాన్యం పేర్కొంది.