తన ఇంటి ముందు కూర్చున్న దళితుడిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి అకారణంగా పోలీసులు చితకబాదారని బాధిత వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం.. తన ఇంటి ఎదుట కూర్చున్నందుకు నూతనకల్ పోలీసులు అకారణంగా స్టేషన్‌కు తీసుకెళ్లి విచక్షణరహితంగా కొట్టారని రాము అనే వ్యక్తి ఆరోపించాడు.
ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చి ఇక్కడ ఎందుకు నిల్చున్నావు అని అడిగారని, ఇది నా ఇళ్లే అని సమాధానమివ్వగా.. తనతో వారిద్దరూ గొడవకు దిగారన్నారు.దీంతో కానిస్టేబుల్స్ తనను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి చితకబాదారని బాధితుడు మొరపెట్టుకున్నాడు. తనను అకారణంగా చితకబాదిన ఎస్సై, కానిస్టేబుల్స్‌పై చర్యలు తీసుకోవాలని బాధితుడు రాము డిమాండ్ చేస్తున్నాడు.
ఇంటి ముందు కూర్చున్న దళితుడిని స్టేషన్‌కు తీసుకెళ్లి అకారణంగా చితకబాదిన పోలీసులు
సూర్యాపేట – ఇంటి ఎదుట కూర్చున్న తనను నూతనకల్ పోలీసులు అకారణంగా స్టేషన్‌కు తీసుకెళ్లి విచక్షణరహితంగా కొట్టారని ఆరోపించిన రాము అనే వ్యక్తి
ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చి ఇక్కడ ఎందుకు నిల్చున్నావు అని… pic.twitter.com/0N7NUhXMN5
— Telugu Scribe (@TeluguScribe) January 1, 2025