యుకే నుండి ఢిల్లీ మీదుగా చెన్నైకి తిరిగి వచ్చిన ఒక ప్రయాణీకుడుకి మంగళవారం కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇది కరోనా వైరస్ కొత్త జాతా కాదా అనేది మాత్రం ఇంకా స్పష్టత లేదు. అతని నమూనాలను పూణేకి పంపించారు. ఇప్పటివరకు 14 మంది ప్రయాణికులను యుకె నుండి తిరిగి వచ్చిన వారిగా గుర్తించి వారిని పర్యవేక్షిస్తున్నారు. యుకె నుండి అన్ని విమానాలను భారత్ నిషేధించింది.
దేశంలో కొత్త వైరస్ అడుగుపెట్టినా సరే మన దేశం అప్రమత్తంగా ఉందని భారత వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. యుకె నుంచి వచ్చే విమానాలను మన దేశం సహా చాలా దేశాలు నిషేధించాయి. విమాన ప్రయాణ నిషేధం డిసెంబర్ 31 న రాత్రి 23:59 వరకు ఉంటుంది. అన్ని యుకె విమానాల సస్పెన్షన్ ఈ రోజు రాత్రి నుండి ప్రారంభమవుతుంది. “యుకెలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని” పరిగణనలోకి తీసుకుని అన్ని యుకె విమానాలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
దీనికి కరోనా స్ట్రెయిన్ గా పేరుపెట్టారు. దక్షిణాఫ్రికా సహా చాలా దేశాల్లో ఇది అడుగుపెట్టింది. ఇక అక్కడి ప్రజల్లో కూడా ఒకరకమైన భయం అనేది మొదలయింది. ఈ నేపధ్యంలో యుకెలో లాక్ డౌన్ విధించారు. అక్కడ నాలుగో లాక్ డౌన్ ని అమలు చేస్తున్నారు. ప్రాధమిక నివేదికల ప్రకారం కొత్త వేరియంట్ 70 శాతం ఎక్కువ వేగంగా ఉందని పేర్కొన్నారు. అయితే ఇది ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్ తో కట్టడి అవుతుందని భావిస్తున్నారు.