ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న విషయం అందరికీ తెలిసిందే. కరోనా తొలి కేసు నమోదై ఏడాది కూడా పూర్తి చేసుకుంది. ఈ మహమ్మారి వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకూ భూమి మీద కరోనా చూపించినంత ప్రభావం వేరే ఏ రోగాలు, వైరస్ లు చూపించలేవు. మానవ శ్వాస వ్యవస్థను దెబ్బ తీసి, రోగ నిరోధక శక్తిని తగ్గిస్తుంది. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటే.. ఇంక అంతే సంగతులు.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పోరాడాల్సిందే.
ఈ వైరస్ బారిన పడి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. రాజకీయ నాయకుల నుంచి సామాన్య ప్రజలు, సెలబ్రిటీలు ప్రాణాలు విడిచారు. ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉన్న వారు మాత్రం కరోనా పోరాడి ప్రాణాలు కాపాడుకున్నాయి. అయితే లండన్ లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది.
లండన్ కు చెందిన ఉకె అనే మహిళ డాక్టర్ గర్భిణీ. ఈమెకు ఏప్రిల్ నెలలో కరోనా బారిన పడి చికిత్స పొందుతుంది. అయితే చికిత్స సమయంలో ఈమెకు అనుకోని సంఘటన ఎదురైంది. కరోనా చికిత్స సమయంలోనే ఉకె కోమాలోకి వెళ్లింది. దీంతో కోమాలోకి వెళ్లిన ఉకె కోలుకోకుంటే కడుపులో ఉన్న బిడ్డలకు ప్రమాదం ఉందని డాక్టర్లు జులై నెలలో ఆమెకు సిజేరియన్ ఆపరేషన్ చేసి డెలివరీ చేశారు.
కొద్ది రోజుల కిందట ఉకె కోమా నుంచి కోలుకుంది. అయితే ఉకెకు ఓ అనుమానం వచ్చింది. కోమాలోకి వెళ్లే ముందు తన పొట్ట ఎత్తుగా ఉండేదని, కోమా నుంచి కోలుకున్న తర్వాత పొట్ట మాములుగా ఉందని.. కోమా వల్ల గర్భస్రావం అయిందని భయపడింది. కానీ, డాక్టర్లు ఆమెకు తన కవల పిల్లలను చూపించారు. దీంతో ఒక్కసారిగా ఉకె ఉధ్వేగానికి లోనైంది. పిల్లలను చూసి కన్నీరు కారుస్తూ.. సంతోషాన్ని వ్యక్తం చేసింది. అన్ని రోజుల పాటు పిల్లలను జాగ్రత్తగా చూసుకున్న వైద్యులకు కృతజ్ఞతలు తెలిపింది.