మాజీ సీజేఐ రంగన్ గొగొయిపై రాజ్యసభలో హక్కుల తీర్మానం

-

ఇటీవల ఓ జాతీయ చానెల్‌లో చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, ఎంపీ రంజన్ గొగొయికు వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ మౌసమ్ నూర్ హక్కుల తీర్మానా(ప్రివిలేజ్ మోషన్)న్ని ప్రవేశ పెట్టారు. వివిధ పార్టీలకు చెందిన మరో 10 ఎంపీలు కూడా రంజన్ గొగొయిపై హక్కుల తీర్మానాలు ప్రవేశ పెట్టే అవకాశం ఉన్నది.

డిసెంబర్ 9న ఓ జాతీయ చానెల్‌‌తో జరిగిన ఇంటర్వ్యూలో మాజీ సీజేఐ రంజన్ గొగొయిను పార్లమెంట్‌కు హాజరుపై విలేకరి ప్రశ్నించారు. నాకు నచ్చినప్పుడు, నేను మాట్లాడవలసిన ముఖ్యమైన విషయాలు ఉన్నాయని నేను భావించినప్పుడు నేను రాజ్యసభకు వెళ్తాను. నేను నామినేటెడ్ సభ్యుణ్ని. ఏ పార్టీ కూడా విప్ ద్వారా నన్ను నియంత్రించలేదు అని అన్నారు. సీజేఐగా పదవీ విరమణ చేసిన నాలుగు నెలల కాలంలోనే రాజ్యసభ సభ్యుడిగా అవకాశం దక్కడంపై ప్రశ్నించగా.. ఇందులో మాయాజాలం ఏముంది? నేను ఏదైనా ట్రిబ్యూనల్‌కు చైర్మన్‌గా వ్యవహరించి ఉంటే రాజ్యసభ సభ్యుడిగా కంటే జీతం, పారితోషికాల విషయంలో మెరుగ్గా ఉండేవాడినని పేర్కొన్నారు.

మాజీ సీజేఐ రంజన్ గొగొయి వ్యాఖ్యలు సభ గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని తృణమూల కాంగ్రెస్ ఎంపీ హక్కుల తీర్మానం ప్రవేశ పెట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version