రష్మిక మందన్న కు అరుదైన గౌరవం….

-

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో స్టార్ హీరోలతో నటించి ప్రేక్షకులను మెప్పించింది.. క్యూట్ ఎకస్ప్రేషన్స్ తో అభిమానులను సొంతం చేసుకుంది.అందుకే రష్మికకు సోషల్ మీడియాలో రోజూ రోజుకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది.తాజాగా రష్మిక మందన్న గురించి ఒక ఇంట్రెస్టింగ్ వైరల్ గా మారింది.

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఈ సంస్థ వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చిన 30ఏళ్లలోపు వ్యక్తులతో ‘ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30’ జాబితాను రూపొందించింది. ఇందులో రష్మిక టాప్ ప్లేస్లో నిలిచారు. ఈ విషయాన్ని ఆమె ట్విటర్ వేదికగా పంచుకుని, ఫోర్బ్స్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల రిలీజ్ అయిన ‘యానిమల్’తో హిట్ అందుకున్న రష్మిక.. ప్రస్తుతం ‘పుష్ప-2’ షూటింగ్లో బిజీగా ఉన్నారు.తమిళంలో ధనుష్, శేఖర్ కముల కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా నటిస్తున్నారు. వీటితో పాటు ది గర్ల్ ఫ్రెండ్,రెయిన్ బో అనే రెండు లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news