జగనన్న పాలనకు జాతీయస్థాయిలో గుర్తింపు.. స్కోచ్ అవార్డుల్లో ఏపీకి మూడో స్థానం

-

ఏపీ ప్రభుత్వానికి మరోసారి జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది.పటిష్ట పరిపాలనతో ప్రజలకు చేరువైన జగనన్న ప్రభుత్వానికి స్కోచ్ అవార్డు లభించింది.ఏపీలో ఇంతవరకు ఏ ప్రభుత్వాలూ చేపట్టని రీతిలో పాలనా సంస్కరణలు చేపట్టి ప్రజల చెంతకు ప్రభుత్వాన్ని చేర్చిన సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఊరూరా గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు… ఇంటివద్దకు రేషన్… పెన్షన్ .. ఇలాంటి అద్భుత విధానాలతో సీఎం వైయస్ జగన్ ప్రతి ఇంటికి పధకాలను తీసుకెళ్లారు.

ఈ క్రమంలో ప్రభుత్వ సుపరిపాలన, గ్రామ సచివాలయ వ్యవస్థలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి, గృహనిర్మాణం, రెవెన్యూ శాఖలకు అరుదైన గౌరవం దక్కింది. పరిపాలనలో అత్యుత్తమ విధానాలను అవలంభిస్తున్న రాష్ట్రంగా ప్రతిష్టాత్మక ”స్కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ రిపోర్ట్-2023”లో దేశంలోనే 3వ స్థానంలో నిలిచింది ఆంధ్రప్రదేశ్.2022లో 4వ స్థానంలో ఉన్న ఏపీ..ఇప్పుడు మూడో స్థానానికి ఎదిగింది. ఆంధ్రప్రదేశ్లో ప్రజా సంక్షేమం కోసం సీఎం వైయస్ జగన్ అమలు చేస్తున్న అత్యుత్తమ విధానాలు, విప్లవాత్మకమైన సంస్కరణల ఫలితంగానే జాతీయ స్థాయిలో ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖకు అరుదైన గుర్తింపు లభించింది.

గ్రామాల్లో సీఎం జగన్ ముందుచూపుతో తీసుకొచ్చిన మార్పులు జాతీయ స్థాయిలో అనేక రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలిచాయి. పారదర్శక పాలన, ప్రజల చెంతకే ప్రభుత్వ సేవలను తీసుకువెళ్లడం వంటి అంశాలతో ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధిలో విజయవంతమైన ఫలితాలను సాధించింది. స్కోచ్ సంస్థ నిర్వహించిన సర్వేలో సుపరిపాలనలో ఏపీ మినహా దక్షిణాది రాష్ట్రాలు తేలిపోయాయి.కనీసం తొలి 5 స్థానాల్లో కూడా దక్షిణాది రాష్ట్రాలు నిలవలేదు.మొదటి స్థానంలో ఒడిశా, రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్, మూడో స్థానంలో ఏపీ, నాలుగో స్థానంలో మహారాష్ట్ర, ఐదో స్థానంలో గుజరాత్ నిలిచాయి. ఈఅవార్డు రాకతో మరోసారి ఏపీ జాతీయస్థాయిలో చర్చల్లో నిలిచింది.సీఎం జగన్ పాలనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news