విద్యార్థుల్లో పెరుగుతున్న మానసిక ఆందోళన.. ఎందుకో తెలుసా!

-

కరోనా వైరస్ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి జనాలను ఎంతో ఇబ్బందులకు గురిచేస్తూ ఉందన్న విషయం తెలిసిందే. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరిని ఇబ్బందులకు గురిచేస్తుంది. వైరస్ కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి ఉద్యోగుల్లో మానసిక ఒత్తిడి పెంచింది మహమ్మారి వైరస్.. విద్యా సంస్థలు పూర్తిగా మూతపడే పరిస్థితి తీసుకు వచ్చి విద్యార్థులను కూడా మానసిక ఒత్తిడికి గురి చేసింది అనే విషయం తెలిసిందే. అయితే ఇటీవలే సేవ్ చిల్డ్రన్స్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో పిల్లల్లో మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది అన్నది బయట పడింది.

లాక్ డౌన్ కారణంగా ఇంటివద్దే ఉండిపోయిన చిన్నారుల్లో మానసిక ఆందోళన ఎంతగానో పెరిగిపోయినదని ఇటీవలే సేవ్ చిల్డ్రన్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. ప్రతి నలుగురు పిల్లల్లో ముగ్గురు ఇలా మానసిక ఆందోళన చెందుతున్నట్లు తెలిపింది అయితే 11 రాష్ట్రాల్లో 10 నుంచి 11 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలపై సర్వే జరపగా ఈ నిజాలు బయటపడ్డాయి. ముఖ్యంగా స్కూల్ పునః ప్రారంభం అయినప్పటికీ వెళ్లేందుకు విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version