వివేక హత్య కేసులో ఒక స్పష్టత రాబోతోంది – ఎంపీ రఘురామ

-

మాజీమంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో త్వరలోనే ఓ స్పష్టత రాబోతుందని అన్నారు ఎంపీ రఘురామకృష్ణరాజు. వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివేకా మరణం వైయస్సార్ కుటుంబానికి బాధాకరమని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని షర్మిల క్లియర్ గా చెప్పిందని గుర్తు చేశారు.

ఇక ఏపీలో వేలకోట్ల లిక్కర్ బిజినెస్ జరుగుతోందని ఆరోపించారు ఎంపీ రఘురామ. మూడు వేల వైన్ షాపులు ఉంటే 11 షాపులకు డిజిటల్ చెల్లింపుల విధానం ఏర్పాటు చేశారని వెల్లడించారు. ఈ వ్యవహారంపై కేంద్రం దృష్టి సారించాలని కోరారు. అలాగే సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ పై గూగుల్ టేక్ అవుట్ ఉపయోగించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పట్టభద్రుల ఓటు హక్కు తీసుకోలేదని, పులివెందుల వెళ్లి ఓటు తీసుకోవాల్సి ఉంటుందని, అంత ఖర్చు ఎందుకు అని అనుకుని ఉంటాడేమోనని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version