గంగానదిలో కూలిపోయిన స్కూల్ .. వైర‌ల్ వీడియో

-

బీహార్ యొక్క కతిహార్లోని జెఎన్ఎన్ జిల్లాలోని గంగా నదిలో ఒక పాఠశాల కొట్టుకుపోయింది. సోమ‌వారం ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. ఇప్ప‌టికే బీహార్‌లో భారీగా వరదలు కురుస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే గంగానది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పాతదైపోయిన ఆ స్కూల్ నీటిలో కూలిపోయింది. నీటి వేగానికి మెల్ల మెల్లగా కూలిపోతున్న స్కూల్ ను పలువురు నది ఒడ్డున నిలబడి ఆసక్తిగా సెల్ ఫోన్ లతో విడియో తీశారు.

అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వరదలు కారణంగా స్కూల్ భవనానికి ప్రమాదం పొంచి ఉందనే సమాచారంతో అధికారులు ముందుగానే క్లాసులను నిలిపివేసి విద్యార్థులను వేరే స్కూల్ కు తరలించారు. దీంతో భవనం కూలిపోయినా ఎటువంటి ప్రాణనష్టం కలగలేదు. గంగానదిలో కోత ఈ జిల్లాలోని తీర ప్రాంతంలో నివసించే ప్రజలకు కష్టతరం చేసింది.

భారీ వ‌ద‌ద‌లు కార‌ణంగా న‌ది ప్ర‌వాహం వేగంగా ఉండ‌డంతో వ్యవసాయ భూములను నాశ‌నం చేస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నానా అవస్థలు ప‌డాల్సిన‌ పరిస్థితి ఏర్ప‌డింది. ఇక‌ గంగా న‌దిలో కొట్టుకుపోయిన ఈ మిడిల్ స్కూల్ లో సుమారు 600 మంది పిల్లల‌కు పైగా చదువుతున్నారు. అయితే పాఠశాలలో మునిగిపోవ‌డంతో ఈ విద్యార్ధులు క‌ష్టాలు త‌ప్ప‌డం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version