కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్… ఇకపై ఆ నిబంధన తప్పనిసరి

-

రోజూ ఆలస్యంగా ఆఫీసుకు వెళ్లే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం సీనియర్ అధికారులతో సహా ఉద్యోగులందరూ తప్పనిసరిగా 9.15లోపే బయోమెట్రిక్ అటెండెన్స్ వేయాలని స్పష్టం చేసింది.ఆలస్యంగా వచ్చే వారిని గాడిలో పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు టాక్. అయితే 15 నిమిషాల ఆలస్యాన్ని(గ్రేస్ పీరియడ్) ప్రభుత్వం అనుమతించింది. కొత్త రూల్‌ ప్రకారం.. ఉదయం 9.00 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉద్యోగులు విధుల్లో ఉండాలి. ఉదయం 15 నిమిషాలు గ్రేస్ పీరియడ్‌ సదుపాయం ఉంటుంది. ఉద్యోగి 15 నిమిషాలయినా ఆఫీస్‌కి రాకపోతే దాన్ని హాఫ్‌ డే సెలవుగా పరిగణిస్తారు.

అయితే నెలలో 2 రోజులకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుంది. 2 రోజులకు మించి గ్రేస్‌ పీరియడ్‌ తర్వాత ఆఫీస్‌కు వస్తే.. అదనంగా ఆలస్యం చేసే ఒక్కోరోజు హాఫ్‌ డే వేతనంలో కోత విధించనున్నారు. అయితే ఉద్యోగికి CLs ఉంటే వాటి నుంచి హాఫ్‌ డే సెలవును మినహాయించనున్నారు. క్యాజువల్ సెలవులు లేకపోతే ఎర్న్‌డ్ లీవుల నుంచి ,అవి కూడా లేకపోతే శాలరీలో కోత విధించనున్నారు. ఆలస్యంగా వచ్చే వాళ్లతోపాటు త్వరగా ఆఫీస్‌ నుంచి వెళ్లిపోయే వాళ్లకు కూడా ఈ నియమం వర్తిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news