పడుకునే ముందు మొబైల్‌ను ఎంత దూరంలో ఉంచాలి..?

-

నిద్రపట్టేవరకూ మొబైల్‌ చూడటం.. నిద్రవస్తుంది అనుకున్నప్పుడు ఆ ఫోన్‌ అక్కడే దిండుకింద పెట్టుకోని పడుకోవడం చాలా మందికి అలవాటు. బెడ్‌మీదనే ఫోన్‌ పెట్టుకోని పడుకుంటారు. మీ ఈ అలవాటు మీకు చాలా ప్రమాదకరం. నిద్రపోతున్నప్పుడు మొబైల్ ఫోన్ మనకు ఎంత దూరంలో ఉండాలి.

మీరు మీ మొబైల్ ఫోన్‌ను మీరు పడుకునే గదిలో మరొక మూలలో ఉంచవచ్చు. కానీ కొన్ని కారణాల వల్ల మీరు మీ మొబైల్ ఫోన్‌తో నిద్రించాలనుకుంటే, దానిని ఫ్లైట్‌ మోడ్‌లో ఉంచడం మర్చిపోవద్దు. అలాగే పొరపాటున కూడా ఫోన్‌ని దిండు దగ్గర పెట్టుకోవద్దు. ఫోన్ దిండు పక్కన పెట్టుకుని పడుకోవడం వల్ల జరిగే నష్టాలు ఇవే..

ఒత్తిడిని పెంచుతుంది : మీ ఫోన్‌ను మీ దిండు పక్కన పెట్టుకుని పడుకోవడం వల్ల మీ ఒత్తిడి స్థాయిలు పెరుగుతాయి. దీనితో పాటు మీకు ఉదయం తలనొప్పి కూడా రావచ్చు. మొబైల్ ఫోన్ల నుండి వచ్చే రేడియేషన్ మీ మెదడును తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.

నిద్రపై ప్రభావం : మీరు మీ ఫోన్‌ని ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఉంచకపోతే, తరచుగా వచ్చే మెసేజ్ టోన్‌లు మీ నిద్రకు భంగం కలిగిస్తాయి. నిద్ర లేకపోవడం వల్ల మీరు ఉదయం అలసిపోయినట్లు అనిపించవచ్చు.

మైగ్రేన్ సమస్య : రాత్రిపూట తల దగ్గర ఫోన్ పెట్టుకుని నిద్రపోవడం వల్ల మైగ్రేన్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అలాగే మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు రాత్రి పడుకునే ముందు మొబైల్ ఫోన్‌లకు దూరంగా ఉండాలి.

నిద్రపోయే ముందు ఫోన్‌ వాడటం కూడా ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా లైట్స్‌ ఆఫ్‌ చేసి స్క్రీన్‌ లైట్‌ డైరెక్టుగా ముఖం మీద పడేలా ఫోన్‌ వాడితే.. కళ్ల కింద డార్క్‌ సర్కిల్స్‌ వస్తాయి. త్వరగా వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. నిద్రపట్టదు. నిద్రలేమి వల్ల ఇంకా అనారోగ్య సమస్యలు పెరిగిపోతాయి. నిద్రపోయే ముందు ప్రశాంతంగా ఉండే పనులు చేయాలి. మాకు ఫోన్‌ చూడటమే ప్రశాంతంగా ఉంటుంది అంటే ఏం చేయలేం ఇక..!!

Read more RELATED
Recommended to you

Latest news