జర్నలిస్ట్ కు షాక్.. కేసులు పెడితే తప్పేంటి..? : హైకోర్టు

-

సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు కేసులు పెడితే తప్పేముందని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు కేసులు పెడుతున్నారంటూ ఓ జర్నలిస్ట్ పిల్ వేయడం పై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. సోషల్ మీడియా ఆక్టివిస్ట్ లపై పోలీసులు మూకుమ్మడిగా కేసులు నమోదు చేయడం పై జర్నలిస్టు విజయబాబు వేసిన పిల్ పై హై కోర్టులో ఇవాల విచారణ జరిగింది.

ఈ సందర్భంగా ఈ కేసులకు సంబంధించి పిల్ వేయడం పై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయమూర్తులను కూడా అవమానపరిచేలా పోస్టులు పెట్టారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పోలీసుల చర్యలను నిలువరిస్తూ ఎలాంటి బ్లాంకెట్ ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. పోలీసులు పెట్టి కేసులపై అభ్యంతరం ఉంటే సంబంధిత వ్యక్తులు నేరుగా కోర్టును ఆశ్రయించవచ్చని వెల్లడించింది. ఇటీవల కాలంలో కొన్ని సోషల్ మీడియాలలో కొంతమంది మహిళలను కూడా దూషిస్తూ పెట్టిన పోస్టులను హైకోర్టు ధర్మాసనం దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. 

Read more RELATED
Recommended to you

Exit mobile version