సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణ మురళిపై గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును అవమానించేలా తీవ్ర వ్యాఖ్యలు చేసారని , పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు తెలుగు యువత ఉపాధ్యక్షుడు దియ్య రామకృష్ణ ప్రసాద్. పోసాని కృష్ణ మురళి చేసిన వ్యాఖ్యలు నేపథ్యంలో కోట్లాది మంది భక్తులు మనోభావాలు దెబ్బతిన్నాయని ఫిర్యాదు చేశారు. ఈ తరుణంలోనే… కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పట్టాభిపురం పోలీసులు.
ఇక సినీ నటి శ్రీ రెడ్డికి మరో షాక్ తగిలింది. సినీ నటి శ్రీ రెడ్డిపై గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోమ్ మినిస్టర్ అనిత పై సామాజిక మాధ్యమాల్లో జుప్సాకరంగా మెసేజ్లు పెడుతుందంటూ..సినీ నటి శ్రీ రెడ్డిపై గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.
ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు మచిలీపట్నం టిడిపి సోషల్ మీడియా కన్వీనర్ అసిలేటి నిర్మల. దళిత మహిళ అయిన మంత్రి అనిత పై అసభ్యకరంగ మాట్లాడినందుకు.. ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని గుడివాడ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో… సినీ నటి శ్రీ రెడ్డిపై గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.