పుణెలో షాకింగ్ ఘటన.. డ్రైనేజీ క్లీనింగ్ ట్యాంకర్‌ను మింగేసిన భారీ గుంత!

-

మహారాష్ట్రలోని పుణెలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.డ్రైనేజీ క్లీనింగ్ కోసం వచ్చిన మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన భారీ ట్యాంకర్‌ను హఠాత్తుగా ఓ భారీ గుంత మిగేసింది. ట్యాంకర్ బరువు కారణంగా వెనుక టైర్లు ముందుగా గుంతలోకి కుంగగా..ఆ తర్వాత క్రమంగా ఆ ట్యాంకర్ పైకి లేచి మొత్తం అందులోకి వెళ్లిపోయింది. ప్రమాదాన్ని గమనించిన ట్యాంకర్ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి..బయటికి దూకి ప్రాణాలు రక్షించుకున్నాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.అయితే, డ్రైనేజీ వాటర్ క్లీనింగ్ కోసం అని మునిసిపల్ ట్యాంకర్ వచ్చింది. అప్పటికే ఆ ప్రదేశంలోని గ్రౌండ్ మొత్తం మురుగు నీటితో నిండిపోయింది. దీంతో ట్యాంకర్ కుంగిన ప్రదేశం మొత్తాన్ని మురుగు నీరు వదులుగా చేసింది. అక్కడ భూమి పట్టుకోల్పోవడంతో ట్యాంకర్ వస్తున్న రోడ్ మొత్తం కుంగి భారీ గుంత ఏర్పడింది. దీంతో ట్యాంకర్ అందులోకి వెళ్లపోయింది.

 

డ్రైవర్ ఎలాగోలా బయటపడ్డాడు. ప్రస్తుతం ట్యాంకర్‌ను బయటకు తీసి ఆ మురుగు నీటిని బయటకు తోడి ఆ గుంతను పూడ్చే పనులు కొనసాగుతున్నాయి.కాగా, ఆ ట్యాంకర్ బుద్వార్ పెత్ ప్రాంతంలోని పోస్ట్ ఆఫీస్ కార్యాలయం ప్రాంగణంలో మునిగిపోయింది. ట్యాంకర్ కుంగిన ప్రాంతంలో గతంలో అక్కడ బావి ఉండేదని,దానిపైన స్లాబ్ వేసి కవర్ చేసినట్లు ఓ అధికారి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version