ఈ మధ్య హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఘోర ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా పెద్ద అంబర్ పేట వద్ద ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల ఓ లారీ డ్రైవర్ నిద్ర మత్తులో తూగుతూ లారీని వేగంగా నడపడంతో ఓఆర్ఆర్ పై నుంచి కింద పడిన విషయం తెలిసిందే. అది జరిగి వారం రోజులు కూడా కాక ముందే అదే పెద్ద అంబర్ పేట ఓఆర్ఆర్ వద్ద మరో ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.
రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేట వద్ద తాజాగా ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతి వేగంగా వెళ్తున్నటువంటి కారు ఉన్నట్టుండి అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టడంతో భారీ ప్రమాదానికి గురైంది. కారు ఫల్టీలు కొడుతూ కింద పడటంతో కారులో ప్రయాణిస్తున్న ఓ మహిళా అక్కడికక్కడే మరణించింది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. సమాచారం అందించిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి వెల్లి మరణించిన మహిళా మృతదేహాన్ని ఉస్మానియా మార్చురికి తరలించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.