ఏపీలోని విజయనగరం జిల్లాలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దారుణ హత్యకు గురయ్యాడు. జిల్లాలోని తెర్లాం మండలం నెమలాంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కొనారి ప్రసాద్ (28)ను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేసి గ్రామ శివారులో పడేసినట్లు పోలీసులు గుర్తించారు.
మృతుడు ప్రసాద్ సోమవారం రాత్రి తన ద్విచక్రవాహనంపై తాత గారి ఊరు బూరిపేట నుంచి నెమలాం వస్తుండగా కాపు కాచి దుండగులు ఈ హత్య చేసినట్లు తెలుస్తోంది. మృతుడి తలపై తీవ్ర గాయంతో పాటు శరీరంపై దెబ్బలు తగిలిన ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దారుణ హత్య….
విజయనగరం జిల్లా తెర్లాం మండలం నెమలాంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దారుణహత్యకు గురయ్యాడు. కొనారి ప్రసాద్ (28) అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు చంపి గ్రామ శివారులో పడేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రసాద్ సోమవారం రాత్రి తన బైక్పై తాత గారి ఊరు… pic.twitter.com/7bnlVtS3V5
— ChotaNews App (@ChotaNewsApp) February 11, 2025