ఆగస్టు 21న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం – సీఎం కెసిఆర్

-

ఆగస్టు 21న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు తెలంగాణ సీఎం కెసిఆర్ ప్రకటన చేశారు. భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ‘స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం’ కార్యక్రమాల నిర్వహణలో భాగంగా ఆగస్టు 8 నుంచి 22 వరకు జరిగే కార్యక్రమాలు వాటి అమలు తీరుపై ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన శ్రీ కె. కేశవరావు నేతృత్వంలోని కమిటీ సభ్యులు ఇతర ముఖ్యులతో ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు.

‘స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం’ లో భాగంగా నిర్వహించే రోజు వారీ కార్యక్రమాలు:
‣ ఆగస్టు 08: స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం ప్రారంభోత్సవ కార్యక్రమాలు
‣ ఆగస్టు 09: ఇంటింటికీ జాతీయ పతాకాల పంపిణీ ప్రారంభోత్సవం
‣ ఆగస్టు 10: వజ్రోత్సవ వన మహోత్సవంలో భాగంగా గ్రామ గ్రామాన మొక్కలు నాటడం, ఫ్రీడం పార్కుల ఏర్పాటు
‣ ఆగస్టు 11: ఫ్రీడం రన్ నిర్వహణ
‣ ఆగస్టు 12: రాఖీ పండుగ సందర్భంగా వివిధ మీడియా సంస్థల ద్వారా ప్రత్యేక వజ్రోత్సవ కార్యక్రమాల ప్రసారాలకు విజ్జప్తి
‣ ఆగస్టు 13: విద్యార్థులు, యువకులు, మహిళలు, వివిధ సమాజిక వర్గాల భాగస్వామ్యంతో వజ్రోత్సవ ర్యాలీలు
‣ ఆగస్టు 14: సాయంత్రం సాంస్కృతిక సారథి కళాకారుల చేత నియోజకవర్గ కేంద్రాల్లో ప్రత్యేక సాంస్కృతిక జానపద కార్యక్రమాలు. ప్రత్యేకంగా బాణాసంచాతో వెలుగులు విరజిమ్మడం
‣ ఆగస్టు 15: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
‣ ఆగస్టు 16: ఏక కాలంలో, ఎక్కడివారక్కడ ’తెలంగాణ వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన. సాయంత్రం కవి సమ్మేళనాలు, ముషాయిరాల నిర్వహణ
‣ ఆగస్టు 17: రక్తదాన శిబిరాల నిర్వహణ
‣ ఆగస్టు 18: ‘ఫ్రీడం కప్’ పేరుతో క్రీడల నిర్వహణ
‣ ఆగస్టు 19: దవాఖానాలు, వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలు, జైల్లలో ఖైదీలకు పండ్లు, స్వీట్ల పంపిణీ
‣ ఆగస్టు 20: దేశభక్తిని, జాతీయ స్ఫూర్తిని ప్రకటించే విధంగా ముగ్గుల పోటీలు
‣ ఆగస్టు 21: అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, దాంతో పాటు ఇతర స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశం
‣ ఆగస్టు 22: ఎల్బీ స్టేడియంలో వజ్రోత్సవ ముగింపు వేడుకలు నిర్వహించాలని సిఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version