కరీంనగర్ జిల్లాలో దారుణ చోటుచేసుకుంది. కోతులు వెంటబడి బెదిరించడంతో భయాందోళనకు గురైన విద్యార్థి బిల్డింగ్ మీద నుంచి కిందకు దూకాడు. దీంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో భోజనం చేసి తరగతి గదికి వెళ్తున్న క్రమంలో విద్యార్థులపై కోతులు దాడికి యత్నించినట్లు సహచర స్టూడెంట్స్ తెలిపారు.
బిల్డింగ్ పై నుంచి కింద పడిన విద్యార్థిని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి ఎలా ఉందనే విషయం ఇంకా తెలియరాలేదు. వైద్యులు పూర్తిగా పరిశీలించాక ఆ విద్యార్థిని హెల్త్ రిపోర్టును వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. కాగా, కోతుల బెడద నుంచి తమ నుంచి రక్షించాలని స్థానిక కాలనీ వాసులతో పాటు విద్యార్థులు సైతం అధికారులను వేడుకుంటున్నారు.