వైద్యుల నిర్లక్ష్యం కారణంగా వారం రోజుల పసికందు మృతి చెందింది. ఈ ఘటన సిరిసిల్ల జిల్లాలో బుధవారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే..జిల్లాలోని అశోక్ నగర్‌కు చెందిన నేత కార్మికుడు రాగల్ల రాజమౌళి భార్య రాధ గతవారం సిరిసిల్ల జనరల్ ఆస్పత్రిలో చిన్నారికి జన్మనిచ్చింది. మూడు రోజుల తర్వాత పసికందు పరిస్థితి విషమంగా ఉందని కరీంనగర్ తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు.
కారణం చెప్పమంటే చెప్పలేదు.చేసేది లేక కరీంనగర్,హైదరాబాద్‌లో చికిత్సకు తీసుకెళ్లారు.ఈ క్రమంలోనే సోమవారం చికిత్స పొందుతూ పాప మృతి చెందింది. సిరిసిల్ల జిల్లా ఆసుపత్రిలోనే సిబ్బంది నిర్లక్ష్యం చేయకుండా మెరుగైన వైద్యం అందిస్తే తమ పాప ప్రాణాలతో దక్కేదని, తమ పరిస్థితి మరొకరికి రావద్దంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.