వీధి వ్యాపారులకు ఆర్థిక ఊరట కల్పిస్తు ప్రధానమంత్రి స్వనిధి పథకం గడువు 2030 మార్చి 31 వరకు పొడిగించబడింది. ఈ స్కీం కింద వీధి వ్యాపారులకు పూచికత్తు లేకుండా లోన్ ఇస్తారు. ఈ పథకం కింద 1.15 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. రుణ పరిమితులు పెంచడం, యూపీఐ క్రెడిట్ కార్డ్, డిజిటల్ క్యాష్ బ్యాక్ లాంటి సౌకర్యాలు వీధి వ్యాపారుల జీవనోపాధిని మరింత బలోపేతం చేస్తున్నాయి. ఈ పథకం గురించి పూర్తి వివరాలు చూద్దాం..
ప్రధానమంత్రి స్వనిధి పథకం 2020 జూన్ 1న కోవిడ్ టైంలో వీధి వ్యాపారులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రారంభించారు. ఈ పథకం గడువు 2024 డిసెంబర్ నుంచి 2030 మార్చి 31 వరకు తాజాగా పొడిగించారు. రూ.7,322 కోట్ల బడ్జెట్ తో 1.15 కోట్ల మందికి అందులో 50 లక్షల మందికి కొత్త లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుంది. మొదటి రుణం 10,000 రూపాయలు నుంచి 15 వేలకు రెండవ రుణం రూ. 20 వేల నుండి రూ.25 వేలకు పెంచబడింది. మూడవ రుణం రూ.50 వేలుగా ఉంది.

రెండవ రుణం సకాలంలో చెల్లించిన వారికి UPI రూపే క్రెడిట్ కార్డు అందుబాటులోనికి వస్తుంది. ఇది వ్యాపార వ్యక్తిగత అవసరాలకు తక్షణ ఋణ సౌకర్యం కల్పిస్తుంది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు 16 వేల రూపాయల వరకు క్యాష్ బ్యాక్ ఇవ్వబడుతుంది.pm స్వనిధి సమృద్ధి ద్వారా లోకల్ వీధి వ్యాపారులు వారి కుటుంబాలకు వివిధ ప్రభుత్వ పథకాలు ప్రయోజనాలు అందుతాయి.
జులై 30, 2025 నాటికి 68 లక్షల మందికి రూ.13,797 కోట్లతో 96 లక్షల రుణాలను అందించబడ్డాయి. వారికీ సామాజిక హోదాను అందించి డిజిటల్ నైపుణ్యాలను పెంపొందించడంతోపాటు FSSAI తో కలిసి ఆహార వ్యాపారులకు పరిశుభ్రత శిక్షణ కూడా ఇస్తుంది. ఈ పథకం గడువు పొడిగింపు, వీధి వ్యాపారులకు పెద్ద ఊరట అని చెప్పచ్చు.