నీకోసం ఎవరో ఏదో చేయాలని అనుకోకు అని చెప్పే అద్భుతమైన కథ..

-

మనుషుల్లో చాలా మంది ఎదుటివారి నుండి ఎక్స్ పెక్ట్ చేస్తూ ఉంటారు. మనం ఎక్స్ పెక్ట్ చేసినపుడు అవి నెరవేరితే బాగానే ఉంటుంది. కానీ మనం ఎక్స్ పెక్ట్ చేసిన ప్రతీసారీ అలా జరగకపోవచ్చు. అలాంటప్పుడే బాధపడతాం. ఏ విషయంలో అయినా ఎదుటివారిపై అంచనాలు పెట్టుకోవడం సరైన పని కాదు. ఎవరో ఏదో చేస్తారని, వారిపై నమ్మకం పెట్టుకోవడం కరెక్ట్ కాదని తెలిపే అద్భుతమైన కథ.. డేర్ టు డూ మోటివేషన్ నుండి.

ఒక శిష్యుడు తన గురువు గారిని ఈ విధంగా అడుగుతాడు. నా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి? దానికి గురువు గారు, ఈ ప్రశ్న నాక్కాదు.. మీ తోటి విద్యార్థుల్లో ఒకరిని అడుగు వారికి తెలుస్తుంది అని చెప్తాడు. వెళ్ళి వారిలో ఒకరిని అడగ్గా, నాక్కొంచెం పనుంది, వెళ్ళి వేరే వాళ్ళని అడుగు అంటాడు. వేరే వాళ్ళని అడగ్గా, నాకు కడుపు నొప్పిగా ఉంది. ఇంకొకరిని అడుగు అంటాడు. ఇలా ఒక్కొక్కరుగా అందరినీ అడగ్గా, అందరూ ఏదో ఒక కారణం చెబుతారే తప్ప మనసుని ప్రశాంతంగా ఎలా ఉంచుకోవాలో చెప్పరు.

అప్పుడు ఆ శిష్యుడు మళ్ళీ గురువు గారి వద్దకి వచ్చి. నాకెవ్వరూ ఏమీ చెప్పడం లేదు. నెన్నెందుకిలా చూస్తున్నారు. నాకేమీ నేర్పించడం లేదు అని చెప్పి బాధపడతాడు. దానికి గురువు శిష్యుడి దగ్గరికి వచ్చి, పిచ్చివాడా వాళ్ళందరూ నీకు సమాధానం చెప్పారు. నువ్వే అది కనుక్కోలేకపోయావు అని అంటాడు. అప్పుడు శిష్యుడికి అర్థమవుతుంది. నీ జీవితంలో ఏది కావాలన్నా నువ్వే కనుక్కోవాలి. దేని గురించైనా నువ్వే ఆలోచించుకోవాలి. పక్కవారెవరూ నీ సమస్యలకి పరిష్కారం చూపరు.

అది నీ సమస్య. నువ్వే కిందా మీదా పడి పరిష్కరించుకోవాలి. ఎవరో ఏదో నేర్పుతారని, వాళ్ళ వల్ల నీ జీవితం పూర్తిగా మారిపోతుందని అస్సలు అనుకోవద్దు.

Read more RELATED
Recommended to you

Exit mobile version