ఏలూరులో రన్నింగ్ ట్రైన్ నుంచి ఓ యువకుడు జారిపోయాడు.ప్రమాదవశాత్తు ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు కొత్త బస్టాండ్ సీఆర్‌ఆర్ కళాశాల తమ్మిలేరు అండర్ రైల్వే బ్రిడ్జి దగ్గర వ్యక్తి జారి పడ్డాడు. అతడు అరుపులు కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న ప్రజలు వెంటనే ఫైర్ సిబ్బందికి కాల్ చేయగా.. ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మూడు గంటల పాటు సహాయకచర్యలు కొనసాగించి వ్యక్తిని రక్షించారు.
గాయపడిన సమయంలో ఆ యవకుడికి తీవ్ర గాయాలవ్వగా..వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే,ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఫుడ్ బోర్డింగ్ ఏమైనా చేశాడా? కాలు జారి కింద పడిపోయాడా? అని పోలీసులు అనుమానిస్తున్నారు.