తిరుమల భక్తులకు శుభవార్త. రేపు ఉదయం 5 గంటలకు స్థానికులకు దర్శన టోకేన్లు జారీ కానున్నాయి. ఎల్లుండి శ్రీవారి దర్శనానికి స్థానికులను అనుమతించనుంది టిటిడి. తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, తిరుమల, చంద్రగిరి, రేణిగుంట మండల పరిధిలోని స్థానికులకు ఆధార్ కార్డ్ ఆధారంగా దర్శన టోకెన్లు జారి చేయనుంది. తిరుపతి మహతి, తిరుమల కమ్యూనిటీ హాల్ వద్ద టోకెన్లు జారి చెయ్యనుంది టిటిడి.
ఈ తరుణంలోనే… చంద్రగిరి వాసులకు అపూర్వ అవకాశం కల్పించింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. తిరుపతి వాసులతో పాటు చంద్రగిరి నియోజకవర్గంలోని తిరుచానూరు, తిరుపతి రూరల్ మండలం,శ్రీనివాసమంగాపురం వాసులకు తిరుమల స్వామీ వారి దర్శనం భాగ్యం కల్పించారు సీఎం చంద్రబాబు.. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని విజ్ఞప్తి మేరకు స్పందించి నిర్ణయం తీసుకున్నారు బాబు. ప్రతి నెల తోలి మంగళవారం రోజునా ఇకపై తిరుపతి వాసులతో చంద్రగిరి వాసులకు దర్శనం కలుగనుంది.