రాత్రి వేళ గల్లీలో నడుచుకుంటూ వెళ్తున్న యువతిపై ఓ దుండగుడు వెనుక నుంచి వచ్చి గట్టిగా పట్టుకుని లైంగిక దాడికి యత్నించాడు. ఆ సమయంలో సదరు యువతి ఫ్రెండ్ పక్కనే ఉండగా.. ఆమె సైతం బెంబేలెత్తిపోయింది. ఈ ఘటన బెంగళూరులో ఆదివారం రాత్రి చోటుచేసుకున్నట్లు సమాచారం.
బెంగళూరులోని బీటీఎం లేఅవుట్లో తెల్లవారుజామున ఇద్దరు మహిళలు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.గతకొన్ని రోజులుగా వారిపై కన్నేసిన ఓ దుండగుడు.. ముందస్తు ప్లాన్ ప్రకారమే వారి వద్దకు వచ్చి వారిలో ఓ యువతిని లైంగిక వేధింపులకు గురిచేశాడు. బాధిత యువతి గట్టిగా కేకలు వేయడంతో పాటు తోటి యువతి అతన్ని వారించే ప్రయత్నం చేయగా.. ఆగంతకుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
బెంగళూరులో నడిరోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యువతులపై లైంగిక దాడి చేసిన వ్యక్తి
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
బెంగళూరులోని బీటీఎం లేఅవుట్లో తెల్లవారుజామున ఇద్దరు మహిళలు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. వారి వద్దకు వచ్చి వారిలో ఓ యువతిని లైంగిక వేధింపులకు గురిచేసిన వ్యక్తి… pic.twitter.com/3hFbu3i35l
— Telugu Scribe (@TeluguScribe) April 7, 2025