విద్యా రంగంలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్ రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం శాసనమండలిలోని చైర్మన్ ఛాంబర్‌లో ఆయనతో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణం చేయించారు. ఆ సమయంలో మంత్రి శ్రీధర్ బాబు, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పింగిళి మాట్లాడుతూ.. సీపీఎస్ రద్దు, పెండింగ్ డీఏలు, బిల్లుల చెల్లింపు, మెరుగైన పీఆర్సీ వంటి అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి పరిష్కరిస్తానని తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు హెల్త్ కార్డుల విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని వ్యాఖ్యానించారు.