స్టేజ్ మీద స్పీచ్ ఇస్తూనే కుప్పకూలి.. గుండెపోటుతో విద్యార్థిని మృతి

-

స్టేజ్ మీద స్పీచ్ ఇస్తూనే కుప్పకూలి.. గుండెపోటుతో విద్యార్థిని మృతి చెందింది. మహారాష్ట్ర-ధారాశివ్ జిల్లాలోని ఓ కళాశాలలో జరిగిన ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీడ్కోలు సమావేశంలో మాట్లాడుతూ కుప్పకూలింది బీఎస్సీ విద్యార్థిని వర్ష ఖరాత్.దింతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే గుండెపోటుతో మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. కాగా, ఎనిమిదేళ్ల వయసులో వర్ష గుండెకు ఆపరేషన్ జరిగినట్లు సమాచారం అందుతోంది.

College Student Dies After Collapsing During Farewell Speech In Maharashtra
College Student Dies After Collapsing During Farewell Speech In Maharashtra

కాగా ఈ మధ్యకాలంలో దీర్ఘకాలిక సమస్యలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా హార్ట్ ఎటాక్ సమస్య వయసుతో సంబంధం లేకుండా వస్తోంది. అయితే చిన్న వయసులో గుండెకు సంబంధించిన సమస్యలు రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి అనే చెప్పవచ్చు. ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవన విధానం మారిపోయింది. రోజువారి ఆహారంలో ఎలాంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం లేదు. దీనివలన చాలా దీర్ఘకాలిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఎన్నో కారణాల వలన యువతలో ఒత్తిడి పెరుగుతూ వస్తోంది. ఎప్పుడైతే ఒత్తిడి పెరుగుతుందో కార్టిసాల్ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి. దీంతో బీపి ఎక్కువ అవుతుంది. ఈ విధంగా గుండె ఆరోగ్యం పై ప్రభావం పడుతుంది. దీంతో గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news