చైతూ గురించి తన మనసులో మాట చెప్పిన ప్రముఖ హీరోయిన్..!

-

అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..ఇప్పుడు ఈయనపై అమ్మాయిలు మనసు పారేసుకుంటున్నారనే చెప్పాలి. ఈ క్రమంలోనే తాజాగా దక్షా నాగర్కర్ కూడా నాగచైతన్య గురించి తన మనసులో మాట చెప్పి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.. ఇక ఈమె బంగార్రాజు సినిమా వేడుకలో నాగచైతన్య చూసిన సమయంలో.. కంటిచూపుతో సైగ చేసిన వీడియో బాగా వైరల్ అయింది. దాంతో దక్షా నాగర్కర్ గురించి రకరకాలుగా ప్రచారం జరిగింది. ఈ సినిమాలో దర్శకత్వం వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం సాగుతుందని వార్తలు కూడా వినిపించాయి. సమంతతో విడాకులు తీసుకున్నట్లుగా వార్తలు వచ్చిన వెంటనే ఈ వీడియో వైరల్ అవ్వడంతో చాలామంది రకరకాలుగా కామెంట్లు చేశారు.

అయితే ఈ విషయంపై తాజాగా దక్షా నాగర్కర్ స్పందించింది. ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చైతూ లాంటి అబ్బాయిని ఎలాంటి అమ్మాయి అయినా కోరుకుంటుంది. అతడి వంటి సింపుల్ అబ్బాయిని ప్రతి ఒక్క అమ్మాయి కావాలనుకోవడంలో తప్పులేదు.. అతడు అమ్మాయిల విషయంలో చాలా కేర్ తీసుకుంటాడు.. అమ్మాయిలకు అంతకుమించి గౌరవాన్ని ఇస్తాడు.. నాతో బంగార్రాజు సినిమా షూటింగ్ సమయంలో కౌగిలింత సన్నివేశాలు, ముద్ద సన్నివేశాలు చేస్తూ ఉన్నప్పుడు ఇబ్బంది పడ్డాడు.. ఆ సన్నివేశాలు చిత్రీకరణ తర్వాత సారీ కూడా చెప్పేవాడు అంటూ నాగచైతన్య గురించి చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.

ఇకపోతే బంగార్రాజు వేడుక సందర్భంగా సైగ గురించి మాత్రం ప్రస్తుతానికి ఏం చెప్పను అన్నట్లుగా టాపిక్ ను మార్చేసింది. మొత్తానికైతే దక్ష నాగర్కర్ నాగచైతన్య పై మనసు పారేసుకుందని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్. ఏది ఏమైనా ఈ ముద్దుగుమ్మ ఇలాంటి కామెంట్లు చేయడం ఇప్పుడు వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version