నిన్న మాట్లాడిన కేటీఆర్ మాటల్లో బేలాతనం కనిపిస్తుంది అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. జిల్లాలో లీగల్ సెల్ ఏర్పాటు చేయడంలో ఆంతర్యం ఏమిటి. జిల్లాలో పది రకాల భూములు కబ్జా కలేదా గుండెల మీద చేయి వేసుకొని చెప్పాలి. మీరు కట్టి తెలంగాణ భవనం ఆక్రమించిన స్థలం లో కట్టారు. చిత్త శుద్ధి ఉంటే ఆక్రమించిన కట్టిన భూమిని తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాలి. అర్హుల కు చెందాల్సిన భూములు అక్రమంగా కబ్జా చేసారు. అక్రమంగా కబ్జా చేసిన 2 వందల ఎకరాల భూములు తిరిగి స్వాధీనం చేసున్నాం.
గత ప్రభుత్వంలో పెదవాళ్ళకు న్యాయం జరుగలేదు. ఫార్ములా కేసుల్లో విచారణ ఏసీబీ, ED దర్యాప్తు సంస్థలు చేపట్టారు. మేడిగడ్డ అడ్డంగా కుంగి పోయింది. గత ప్రభుత్వంలో అనేక టెలీఫోన్ ట్యాపింగ్ చేసి అడ్డంగా దొరికిపోయారు. సాక్ష్యాలతో సహా పత్రికలు రాస్తే అవికూడా అబద్ధం అని మాట్లాడుతున్నారు. కష్టపడి ముఖ్యమంత్రి అయితే నానా మాటలు మాట్లాడుతున్నారు. మీరు పేర్లు రాసుకొని ఏం చేస్తారు రానున్న రోజుల్లో BRS పార్టీ ఉండదు. దేశ పౌరుడు కానీ వ్యక్తిని వేములవాడ ఎమ్మెల్యే గా చట్ట సభల్లో కూర్చోబెట్టారు. ప్రజలు మీకు ప్రతిపక్షంలో కూర్చునే స్థాయి ఇచ్చారు, ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాలని కోరుతున్న అని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.