ఆది శ్రీనివాస్: కవిత అరెస్ట్.. బీజేపీ, బీఆర్ఎస్ డ్రామా..!

-

కవిత అరెస్ట్ లోక్ సభ ఎన్నికల కోసమేనని ఆది శ్రీనివాస్ అన్నారు. బిజెపి, బీఆర్ఎస్ డ్రామా అని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బీఆర్ఎస్ బిజెపి రెండు ఒకటి కాదు అని చెప్పడానికి మాత్రమే అరెస్ట్ డ్రామా చేశారు. లోక్సభ ఎన్నికల కోసమే బిజెపి బీఆర్ఎస్ డ్రామా ఆడుతున్నారని చెప్పారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆయన మాట్లాడుతూ పదేళ్ల క్రితం నుండి బిఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి అక్రమాలు జరిగాయని చెప్పారు.

కరీంనగర్ ప్రతిమ మల్టీప్లెక్స్ లో దొరికిన ఆరు కోట్ల 67 లక్షల డబ్బు ఎవరివి అని అన్నారు ఎన్నికల షెడ్యూల్ రాకముందే విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేసేందుకు బీఆర్ఎస్ నేతలు ప్లాన్ చేశారని ఫైర్ అయ్యారు ఆర్టీసీ స్థలం తీసుకుని ప్రతిమ మల్టీప్లెక్స్ కట్టారని మండిపడ్డారు కేసీఆర్ పై అత్యంత సన్నిహితుడు వినోద్ కుమార్ ది ప్రతిమ అని అన్నారు దీని మీద కేసీఆర్ సమాధానం చెప్పాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news