సన్రైజర్స్ కు అంత సీన్ ఉందనుకోలేదు..?

-

యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పుడు క్రికెట్ విషయాలపై తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకునే భారత మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా నిన్న సన్రైజర్స్ మ్యాచ్ విజయం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు అంత సత్తా ఉంది అని తాను ఊహించలేదు అంటూ చెప్పుకొచ్చాడు ఆకాష్ చోప్రా. కేవలం టాపార్డర్ లోని ఇద్దరు బ్యాట్స్ మెన్లు… ఇద్దరు బౌలర్లపై సన్రైజర్స్ జట్టులో ఆధారపడి ఉంది అని అనుకున్నానని కానీ నిన్న జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో అద్భుతంగా రాణించి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును ఓడించింది అంటూ ప్రశంసలు కురిపించాడు.

టాప్ ఆర్డర్లో లో ఉన్న బ్యాట్స్ మాన్ అవుట్ అయినప్పటికీ కూడా కేన్ విలియమ్సన్ జాసన్ హోల్డర్ ఎంతో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడారని.. బౌలర్లు కూడా అద్భుతంగా రాణించడంతో రాయల్ బెంగళూరు లాంటి జట్టును కూడా తక్కువ స్కోరుకే పరిమితం చేయగలిగారు అంటూ ఆకాష్ చోప్రా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో సమిష్టిగా ఆటగాళ్ల కృషితోనే విజయం సాధించారు అంటూ చెప్పుకొచ్చాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version