అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా మూవీ షూటింగ్‌లకు కేంద్రం అనుమతులు ఇవ్వడంతో ఈ మూవీ షూటింగ్ ఇటీల టర్కీలో మొదలైంది. విదేశాల్లో లాక్డౌన్ తరువాత ప్రారంభమైన తొలి భారతీయ చిత్రంగా నిలిచింది. ఆగస్టు నుంచి ఈ మూవీ షూటింగ్ ఢిల్లీలో జరుగుతోంది. అమీర్‌ఖాన్ పక్కటెముకకు గాయం కావడంతో సఫరవుతున్నారట. అయితే షూట్ తన కారణంగా ఆలస్యం కాకూడదని ఆ నొప్పిని పంటి బిగువున భరిస్తూ పెయిన్ కిల్లర్స్ వాడుతూ షూట్ చేస్తున్నారట.
ఇటీవల రన్నింగ్ సీక్వెన్స్ ని చిత్రీకరించారట. పెయిన్ బాధపెడుతున్నా అమీర్‌ఖాన్ ఎలాంటి విరామం లేకుండా షూటింగ్లో పాల్గొన్నారట. సినిమాపై వున్న ప్యాషన్ అమీర్‌ని షూటింగ్లో పాల్గొనేలా చేసిందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. డిసెంబర్ 24న ఈ చిత్రాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ థియేటర్లలో రిలీజ్ చేయాలని అమీర్‌ఖాన్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.