కోవిడ్ 19 కాంటాక్ట్ ట్రేసింగ్ యాప్ ఆరోగ్య సేతు రికార్డు సృష్టించింది. చాలా తక్కువ కాలంలోనే ఏకంగా 9 కోట్ల డౌన్‌లోడ్లను పూర్తి చేసుకుంది. ఈ యాప్‌ను ప్రస్తుతం 9 కోట్ల స్మార్ట్‌ఫోన్లలో వాడుతున్నారని నీతి అయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రూపొందించబడిన ఈ యాప్ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.
కోవిడ్ 19 పేషెంట్లను గుర్తించడంతోపాటు అందుకు సంబంధించిన సమాచారాన్ని, హెల్ప్‌లైన్ నంబర్లను, ఇతర సహాయాన్ని పొందేందుకు ఆరోగ్య సేతు యాప్ ఉపయోగపడుతుంది. ఈ క్రమంలోనే కొత్తగా ఫోన్లను వినియోగదారులు కొనుగోలు చేస్తే.. వాటిల్లో తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్ ఉండాలని కేంద్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.
కాగా ఆరోగ్య సేతు యాప్ ద్వారా త్వరలోనే టెలిమెడిసిన్ సేవలను ప్రారంభించనున్నామని అధికారులు తెలిపారు. ప్రజలు ఆ యాప్‌లో తమకు కావల్సిన వైద్య నిపుణుడిని సంప్రదించి తమకు కలిగే అనారోగ్య సమస్యలకు చికిత్స తీసుకోవచ్చని, అందులో వైద్యులు సూచించే మందులను వాడవచ్చని వారు తెలిపారు.