RADHE SHYAM : రాధేశ్యామ్ నుంచి అదిరిపోయే అప్డేట్.. లవ్ ఆంథెమ్ రిలీజ్

-

రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న సినిమా రాధే శ్యాం. పాన్‌ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారు ప్రభాస్‌ ఫ్యాన్స్‌. ఈ సినిమా ప్రమోషన్స్‌ కూడా వేగంగా జరుగుతున్నాయి. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ను టాలీవుడ్‌ యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ రాధాకృష్ణ డెరెక్ట్‌ చేస్తున్నాడు.

ఈ సినిమా యూవీ క్రియేషన్స్‌ సమర్పణ లో తెరకెక్కతోంది. అయితే.. తాజాగా ఈ సినిమా ను ఓ బిగ్‌ అప్డేట్‌ వచ్చేసింది. ఈ సినిమా నుంచి సెకండ్‌ సింగిల్‌ ను విడుదల చేసింది చిత్ర బృందం. హిందీ వర్షెన్‌ లో సాగే… ఈ సాంగ్‌ ఆషికి ఆ గయీ అనే లిరిక్స్‌ తో ప్రారంభం అవుతుంది. ఇక ఈ సాంగ్‌ లో ప్రభాస్‌, పూజా హెగ్డే చాలా అందంగా కనిపించారు. లవ్‌, ఎమోషనల్‌ ఫీలింగ్‌ ఇద్దరూ అలరించారు. ముఖ్యంగా… ఈ సాంగ్‌ లో ప్రభాస్‌, పూజా మధ్య రొమాంటిక్‌ యాంగిల్ బాగా వర్కౌట్‌ అయింది. మూడు నిమిషాల 12 సెకండ్లు సాగే ఈ సాంగ్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక ఇవాళ సాయంత్రం ఈ సాంగ్‌ తెలుగు వర్షన్‌ రిలీజ్‌ కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version