తంగేడు పువ్వు గురించి మహిళలకు పెద్దగా పరిచయం అక్కర్లా..బతుకమ్మను పేర్చేటప్పుడు కచ్చితంగా అందరూ ఈ పువ్వును కూడా వాడుతుంటారు. ఈ పువ్వు పూజలోనే కాదు..ఆరోగ్యంగా ఉండేదుకు కూడా ఉపయోగపడుతుందట. దీంతో చేసిన టీ తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయంటున్నారు నిపుణులు. అవేంటో ఎలా చేయాలో చూసేద్దాం.
ఈ పూలను ఎండలో ఎండబెట్టి పొడి చేసి నీళ్లలో కలుపుకుని తాగాలి. ఇది జ్వరం, పిత్తం, పిరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం, రుతుక్రమం సరిగా లేకపోవడం, కడుపులో పుండు వంటి అనేక రకాల సమస్యలకు పరిష్కారం.
ఇది శరీరానికి డిటాక్సిఫైయర్‌గా కూడా పనిచేస్తుంది. మహిళలకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. పల్లెటూళ్లలో మాత్రమే ఎక్కువగా లభించే తంగేడు పూలను దేశీ మందుల షాపుల్లో కూడా కొనుక్కోవచ్చు. ఎండిన పువ్వులు లేదా పొడి రూపంలో కూడా అందుబాటులో ఉంటుంది. ఎండిన పువ్వులను గ్రైండ్ చేసి పొడి చేసుకోండి.. లేదా చెక్కుచెదరకుండా ఉడకబెట్టండి. తాజా పువ్వు అయినా ఎండబెట్టి వాడుకోవచ్చు.
టీ చేసే విధానం:
ఈ పువ్వుతో టీ చేయడానికి, ముందుగా ఒక పాత్రలో ఒక గ్లాసు నీరు పోసి మరిగించాలి.
ఆ తర్వాత దాన్ని ఫిల్టర్ చేయండి.
మీకు కావాలంటే, మీరు తేనెను కలిపి తీసుకోవచ్చు.
షుగర్ వ్యాధి ఉన్నవారు తేనె కలుపుకోని తాగాలి.
పొడి చేసినా కాచి వడగట్టుకోవచ్చు.
ఊర్లలో విరివిగా దొరికే ఈ పువ్వులో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి చాలామందికి ఇప్పటివరకూ..తెలియదు. పైన చెప్పిన సమస్యలు మీకు ఉంటే ఓ సారి ట్రై చేయండి. అయితే మీకు వీటిని వాడటంలో ఏమైనా ఇబ్బందికలిగితే..వెంటనే ఆయుర్వేద వైద్యులను సంప్రదించండి.