ఆసియాలోనే మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్‌లలో ఒకరైన బ్రూనై సుల్తాన్ కొడుకు అబ్దుల్ మతీన్ ఒక సామాన్యురాలిని వివాహం చేసుకోనున్నారు. బందర్ సెరి బెగవాన్‌లోని బంగారు గోపురం మసీదులో పెళ్లి జరగనుంది.అతని తండ్రి సుల్తాన్ హసనల్ బోల్కియా ప్రపంచంలోనే అత్యధిక కాలం పాలించిన చక్రవర్తినే కాకుండ ఈ భూమి మీద అత్యంత ధనవంతుడిగా పేరుంది. కాగా మతీన్ పెళ్లి చేసుకోబోతున్న వధువు యాంగ్ ములియా అనిషా తన తండ్రి ముఖ్య సలహాదారుల్లో ఒకరి మనవరాలట. 1,788 గదుల ప్యాలెస్‌లో 10 రోజుల పాటు ఎంతో వేడుకగా వీరి పెళ్లి జరగబోతోంది. 4,50,000 కలిగి ఉన్న బ్రూనై చిన్న దేశం.. అయినప్పటికీ అపారమైన చమురు నిల్వలను కలిగి ఉంది.
ప్రస్తుతం మతీన్ కి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. అతను ఆఫీసర్ క్యాడెట్‌గా బ్రిటన్ రాయల్ మిలిటరీ అకాడమీ శాండ్‌హర్ట్స్‌లో పట్టభద్రుడు అయ్యాడు.వధువు అనిషాకి ఒక ఫ్యాషన్ బ్రాండ్ తో పాటు టూరిజం వ్యాపారంలో సహ భాగస్వామిగా ఉన్నారు. 2019 లో ఆగ్నేయ ఆసియా గేమ్స్‌లో పోలోలో బ్రూనై దేశానికి ప్రాతినిధ్యం వహించారు.