నిన్న బయటకు వెళ్ళిపోయిన అభయ్ మూడు వారాలకి ఎంత సంపాదించాడంటే..?

-

ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ నుంచి ముగ్గురు బయటకు వెళ్ళిపోయారు. 14 మంది కంటెస్టెంట్స్ రాగా ముగ్గురు వెళ్లిపోవడంతో ఇంకా హౌస్ లో 11 మంది కొనసాగుతున్నారు. బిగ్ బాస్ ని బండ బూతులు తిట్టిన అభయ్ ని హోస్ట్ నాగార్జున సీరియస్ గా తిట్టారు ఆయనపై విపరీతంగా ఫైర్ అయ్యారు. రెడ్ కార్డు చూపించి బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపొమ్మన్నారు. శనివారమే ఎలిమినేట్ అవుతాడని చాలామంది అనుకున్నారు. తోటి కంటెస్టెంట్లు ప్రాధేయపడటం వలన నాగార్జున ఒక ఆఖరి అవకాశం ఇచ్చారు.

సేఫ్ అయిన నవీన్ ఆదివారం ఎలిమినేషన్ నుంచి తప్పించుకోలేకపోయాడు ఓటింగ్ తక్కువగా ఉండటం వలన ఎలిమినేట్ అయిపోయాడు. మూడవ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన అభయ్ నవీన్ సరిగ్గా మూడు వారాలకి ఇంటికి వెళ్లిపోయాడు. షో ప్రారంభంలో అభయ నవీన్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చాలామంది భావించారు ఏమాత్రం ఎఫెక్ట్ గా గేమ్ ఆడలేక పోయాడు టాస్కులు గేముల్లో డల్ అయిపోయాడు. మూడు వారాలకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అనేది చూస్తే.. అభయ్ నవీన్ కి భారీగానే పారితోషకం వచ్చిందని చెప్పొచ్చు హౌస్ లో ఉన్నందుకు రోజుకు 28,571. అంటే వారానికి రెండు లక్షల రెమ్యూనరేషన్ చేసుకున్నాడు మూడు వారాలకి ఆరు లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version