తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు..!

-

తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో ఎంపీ వైవి సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేసారు. తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి తో విచారణ జరిపించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ క్రమంలో న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కోట్లాదిమంది ప్రపంచ వ్యాప్త శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నానికి టీడీపీ ఒడిగట్టింది. ఇది ఒక పార్టీ, ఒక వ్యక్తికి సంబంధించిన విషయం కాదు. కోట్లాదిమంది భక్తుల విషయం. ఈ ప్రచారంలో నిజాలు నిగ్గు తేల్చాలని సుప్రీంకోర్టులో వైవీ సుబ్బారెడ్డి గారు పిల్ దాఖలు చేశారు.

తొలుత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని అనుకున్నాము. కానీ ఈ అంశం ప్రపంచవ్యాప్త భక్తులకు సంబంధించినది కావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాం ఈ ప్రచారంలో నిజం ఉంటే అది బయటికి రావాలి. లడ్డు తయారీకి ఉపయోగించిన నెయ్యిలో పశువుల కొవ్వు ఉందని సాక్షాత్తు సీఎం ప్రకటించిన నేపథ్యంలో నిజాలు బయటికి రావాలి. విశ్రాంత న్యాయమూర్తి లేదా సిట్టింగ్ న్యాయమూర్తి ద్వారా నిపుణుల కమిటీ ఈ వ్యవహారంపై విచారణ జరపాలి. ఎస్ వాల్యూ తక్కువ ఉంది అంటే కల్తీ జరిగింది అని అర్థం. అంతే తప్ప అందులో పశువుల కొవ్వు కలిసింది అని అర్థం కాదు. తన పాటకు పల్లవి కలిపేలా సిట్ ఏర్పాటు చేశారు. అందుకే మేము సిట్టింగ్ జడ్జి లేదా విశ్రాంతి న్యాయమూర్తి ఆధ్వర్యంలో విచారణ కోరుతున్నాము. వైవీ సుబ్బారెడ్డి గారు పరమ భక్తులు. 40 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నారు. కోట్లాదిమంది భక్తులకు నిజం తెలియాలి అన్న ఉద్దేశంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు అని న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version