సరస్వతి దేవి ఎందుకు రాతి మీద కూర్చుంటుందో తెలుసా?

-

చదువుల తల్లి సరస్వతీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఆమె లేనిదే చదువులు వుండవు అని పురాణాలు చెబుతున్నాయి.అయితే ఆమె గురించి కొన్ని విషయాలు చాలా మందికి తెలియవు.ఆ తల్లి ఎప్పుడూ తెల్లని తామర పువ్వు మీద కూర్చుంటుంది అని సినిమాల లో చూపిస్తారు.నిజానికి అమ్మవారు రాయి మీద కూడా కూర్చుంటారని పురాణాలు చెబుతున్నాయి. అసలు విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


చదువుల తల్లిగా ఆరాధింపబడుతున్న ఈ అమ్మ.. త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ దేవేరి. వేదాలు, పురాణాల్లో సరస్వతీ దేవి గురించి చాలా విషయాలను చెప్పబడ్డాయి.దేవీ నవరాత్రి, వసంత పంచమి ఉత్సవాల్లో సరస్వతీ దేవిని ప్రముఖంగా ఆరాధిస్తారు. అయితే ఈ విషయాన్ని మనకు తెలుసు. అలాగే ఆమె చేతిలో వీణ పట్టుకొని, తెలుపు రంగు బట్టలు ధరించి హంసపై లేదా రాయిపై కూర్చుని కనిపిస్తూ ఉంటుంది. అయితే మన ఇంట్లోనే లేదా వేరే వాళ్ల ఇళ్లల్లోనో ఉండే అమ్మవారి ఫొటోలో సరస్వతీ దేవి రాయిపై కూర్చొని మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇందుకు కారణం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

లక్ష్మి దేవిలా నిలకడ లేని తామర పువ్వులో తన స్థానం ఉండదని చెప్పటమే ప్రధాన ఉద్దేశ్యము. సిరి సంపదలు హరించుకు పోవచ్చు. నేర్చుకున్న విద్య, విజ్ఞానం ఎక్కడికి పోలేనివని ఈ భంగిమకు అర్థం – పరమార్థం. సరస్వతి దేవి వాహనము హంస. హంస చాలా జ్ఞానము కలది. పాలు, నీళ్ళు కలిపి దాని ముందు ఉంచితే పాలని మాత్రమే స్వీకరిస్తుంది. అలాగే విజ్ఞానం వల్ల ఏదైనా సాధించవచ్చునని మనం నేర్చుకోవచ్చు..ఈ అమ్మవారు కేవలం విద్యను మాత్రమే కాదు సర్వశక్తి సామర్థ్యాలను కూడా తనను భక్తి శ్రద్దలతో పూజించేవారికి ఇస్తుందని దేవీ భాగవతం నవమ స్కంధం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version