జికా వైరస్ (zika virus) కేసు కేరళలో నమోదు అయ్యింది. అయితే ఇది దోమ కాటు కారణంగా వస్తుంది. తిరువనంతపురం మరియు ఇతర ప్రాంతాలలో 13 మందికి ఈ జికా వైరస్ వచ్చిందేమో అని అనుమానిస్తున్నారు.
జూన్ 28న ఒక మహిళా ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యింది. జ్వరం, తలనొప్పి తో పాటుగా ఒంటి మీద ఎర్రటి మచ్చలు ఉన్నాయి. ఈ రిపోర్ట్స్ ని NIV పుణికి పంపించగా జికా వైరస్ ఉన్నట్లు గుర్తించారు.
జికా వైరస్ అంటే ఏమిటి..?
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం వైరస్ ఇన్ఫెక్ట్ అయిన దోమ కాటు వల్ల వస్తుంది. డెంగ్యూ, చికెన్ గునియా, ఎల్లో ఫీవర్ వంటి వాటిని తీసుకొచ్చే దోమలే దీనిని కూడా స్ప్రెడ్ చేస్తాయి.
జికా వైరస్ లక్షణాలు:
ఇక మనం జికా వైరస్ లక్షణాలు గురించి చూస్తే…
జ్వరం
ర్యాషెస్
తలనొప్పి
జాయింట్ పెయిన్స్
కళ్లు ఎర్రబడటం
జికా వైరస్ మరియు ప్రెగ్నన్సీ:
సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం జికా వైరస్ గర్భిణీ నుండి తన ఫీటస్ కి స్ప్రెడ్ అవుతుందని చెప్పారు. ప్రెగ్నెన్సీ సమయంలో ఇలాంటి ఇన్ఫెక్షన్ వస్తే బర్త్ డిఫెక్ట్స్ వంటివి ఉంటాయని అన్నారు.
అదే విధంగా సెక్స్ సమయంలో పార్టనర్ కి కూడా సోకే అవకాశం ఉందని చెప్పారు. కాండోమ్స్ ఉపయోగించడం వల్ల స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోవచ్చని అంటున్నారు. ఈ జికా వైరస్ ని కంట్రోల్ చేయడానికి ఎటువంటి వ్యాక్సిన్ లేదు అని డాక్టర్లు అంటున్నారు.
యూనియన్ హెల్త్ ఏజెన్సీ ఏమంటోందంటే ఎవరైతే ఈ లక్షణాలతో బాధపడుతున్నారో వాళ్లని ఎక్కువ రెస్ట్ తీసుకోమని, అవసరమైనంత ఫ్లూయిడ్స్ తీసుకోమని అంటోంది. ఆస్ప్రిన్ మరియు non steroidal anti-inflammatory drugs తీసుకోవద్దని చెప్పారు.