కస్టడీకి తహశీల్దార్ నాగరాజు అండ్ కో…లెక్కలు తేలుస్తారా ?

-

కోటీ పది లక్షల లంచం తీసుకుంటూ దొరికిపోయిన కీసర తహశీల్దార్ కేసులో నలుగురు నిందితులకు కస్టడీలోకి తీసుకునేందుకు ఏసీబీ కోర్ట్ అనుమతించింది. తహశీల్దార్ నాగరాజు, శ్రీనాథ్, అంజిరెడ్డి, విఆర్ఏ సాయిరాజ్ మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకోవచ్చని ఏసీబీ కోర్ట్ అనుమతిచ్చింది. ఈ నెల 25 నుండి 27 వరకు ఏసీబీ కస్టడీకి ఏసీబీ కోర్ట్ అనుమతి ఇచ్చింది.

దీంతో రేపు చంచల్ గూడ జైల్లో ఉన్న నలుగురు నిందితులను ఏసీబీ కస్టడీలోకి తీసుకోనుంది. రేపటి నుండి మూడు రోజుల పాటు నాంపల్లి ఏసీబీ కార్యాలయంలో వీరిని ఏసీబీ విచారించనుంది. కోటి 10 లక్షల రూపాయల లంచం మీద ఏసీబీ కూపీ లాగనుంది. అంతే కాక తహసీల్దార్ నాగరాజు సమక్షంలోనే బ్యాంక్ లాకర్ ను ఏసీబీ ఓపెన్ చేయనుంది. అంతే కాక ఆంజిరెడ్డి, శ్రీనాథ్ ఇంట్లో దొరికిన ప్రజా ప్రతినిధులకు సంబంధించిన వివరాలు కూడా ఏసీబీ సేకరించనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version