కాంగ్రెస్ లో ఇప్పుడు సోనియా గాంధీకి రాసిన లేఖ తీవ్ర వివాదం అయింది. కాంగ్రెస్ అధినేత్రి అనారోగ్యంగా ఉన్న సమయంలో మీరు ఎలా లేఖ రాస్తారు అని రాహుల్ గాంధీ నేడు జరిగిన పార్టీ సమావేశంలో ప్రశ్నించారు. బిజెపి కార్యకర్తలుగా మీరు మారిపోయారు అని ఆయన సీనియర్లను టార్గెట్ చేసి విమర్శల బాణాలు సంధించారు. ప్రియాంకా గాంధీ కూడా నేడు విమర్శలు చేసారు.
ఇక పార్టీ కీలక నేత అంబికా సోనీ మాట్లాడుతూ… పార్టీ నాయకత్వంపై సోనియా గాంధీకి లేఖ రాసిన వారిపై పార్టీ రాజ్యాంగం ప్రకారం చర్యలు తీసుకోవచ్చని సిడబ్ల్యుసిలో అంబికా సోని అన్నారు. ఆ తర్వాత జిఎన్ ఆజాద్, ఆనంద్ శర్మ మాట్లాడుతూ లేఖ రాసిన వారు ఆందోళనలు తగ్గించాలి అని రాసారు గాని మరో ఉద్దేశం కాదని చెప్పారు. అయినా సరే చర్యలు తీసుకోవాలని ఉంటే తీసుకోండని అన్నారు.