తెలంగాణ ఏసీబీ వలకు చిక్కిన మరో భారీ అవినీతి తిమింగలం

-

గచ్చిబౌలి నానక్ రామ్ గూడా HMDA కార్యాలయంలో ఏసీబీ మరో భారీ తిమింగలన్ని పట్టేసింది. పదిన్నర లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి ఓ అధికారి చిక్కారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి పదిన్నర లక్షల రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఇక కార్యాలయంలో రెండూ గంటలుగా  ఏసీబీ సోదాలు చేశాక ఏసీబీ డిఎస్పీ సూర్యనారాయణ మాట్లాడుతూ డీఎఫ్ఓ ఇనుపనూరి ప్రకాష్ పై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఫిర్యాదులు అందాయని, కాంట్రాక్టర్ల నుండి భారీ ఎత్తున లంచాలు తీసుకున్నట్లు ఫిర్యాదులు అందడంతోనే ఈ రోజు అతని ఛాంబర్ తో పాటు నివాసాల పై సోదాలు చేస్తున్నామని అన్నారు.

acb
acb

ఈ సోదాల్లో ప్రకాష్ ఛాంబర్ లో 10 లక్షల 50 వేల నగదు..అతని పర్స్ లో 19 వేల 800 క్యాష్ గుర్తించామని అన్నారు. ఫిర్యాదుల మేరకు ఈ ఆకస్మిక తనిఖీలు చేపట్టామని, ఔటర్ రింగ్ రోడ్డు గ్రినరీ కోసం కొన్ని కాంట్రాక్ట్ పనులు ఎప్పుడు జరుగుతూ ఉంటాయని, కాంట్రాక్ట్స్ యొక్క బిల్లులు పాస్ చెయ్యడానికి సంబంధిత HMDA లో అర్బన్ ఫారెస్ట్ అధికారులు లంచాలు తీసుకుంటూ ఉంటున్నారని అన్నారు. కార్యాలయంలోని తొమ్మిది గదుల్లో తనిఖీలు నిర్వహించడం జరిగిందని ప్రకాష్ గదిలో దొరికిన నగదు వివరాలు తెలియాల్సి ఉందని ఆయన అన్నారు. ప్రకాష్ ఇంట్లొ కూడా మరో బృందం తనిఖీలు నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news